
గాంధీభవన్ లో జెండా ఎగరేసిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
140కోట్ల భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
దేశ ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు అందించాలని లక్షలాది కాంగ్రెస్ శ్రేణులు ప్రాణత్యాగాలు చేశారు.
ఈరోజు ప్రధానంగా ముగ్గురిని మనం స్మరించుకోవాలి
అహింస మార్గంతో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ.
దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ సమాన హక్కులు కల్పించారు అంబేద్కర్
కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న దేశాన్ని సంక్షేమ ఫలాలు అందించిన మహా నేత నెహ్రూ
ఈ ముగ్గురిని మనం స్మరించుకుని నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనపై ఉంది.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత ఇందిరా గాంధీ..
దేశంలో ఐటీ రంగంలో గొప్ప స్ఫూర్తినిచ్చిన గొప్ప ప్రధాని రాజీవ్ గాంధీ గారు..
దేశాన్ని ఆర్థికంగా పురోగతివైపు నడిపించారు పీవీ , మన్మోహన్..
దేశంలో విభజించు పాలించు విధానాన్ని ఈరోజు బ్రిటిష్ జనతా పార్టీ అవలంబిస్తోంది.
విద్వేషాన్ని వీడలని భారత్ జోడోతో రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారు.
నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు చేసిన 60 ఏళ్లలో చేసిన అప్పుకంటే ఎనిమిదేళ్లలో మోదీ రెండింతలు ఎక్కువ అప్పు చేశారు.
దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది..
బీజేపీ వస్తే జీడీపీ పెరుగుతుందన్నారు…
కానీ పెరిగింది.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ..
దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది..
మణిపూర్ మండుతుంటే మోదీ, అమిత్ షా కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారు.
మణిపూర్ లో సైన్యాన్ని పంపి నిలువరించాల్సింది పోయి… కాంగ్రెస్ ఓడించేందుకు ఈడీ, సీబీఐ ని పంపించారు.
నియంతలకంటే నికృష్టాంగ మోదీ వ్యవహరిస్తున్నారు..
ఇండియా కూటమి ద్వారానే మళ్లీ దేశానికి మంచిరోజులు వస్తాయి….
కాంగ్రెస్ హామీలు ఇస్తుంటే.. సీఎం కేసీఆర్ అదే పని చేస్తున్నాడు…
ఓటమి భయంతోనే కేసీఆర్ రుణమాఫీ, నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానంటున్నాడు
రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతున్నదంటే అది కాంగ్రెస్ వల్లే
కేసీఆర్ ఏది చేసినా ప్రజలు నమ్మరు..
బీఆరెస్ ప్రభుత్వం హడావుడిగా అమ్మిన భూములపై మేం వచ్చాక సమీక్షిస్తాం
కేసీఆర్ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడింది… 10వేల ఎకరాలు దోచుకుంది.
కాంగ్రెస్ వస్తుంది రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తుంది.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం
రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటాం.
ఇంటి నిర్మాణానికి ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు అందిస్తాం
ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది
తిరగబడదాం… తరిమికొడదాం నినాదంతో ప్రజల్లోకి వెళదాం
ప్రతీ గడపకు వెళ్లి.. ప్రతీ తలుపు తడదాం..
రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దాం