
క్రీడలతో విద్యార్ధులలో దేహదారుడ్యం పెంపొందుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మోండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్ లో ఆదయ్య నగర్ వాలీ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర, బాలికల ఒకరోజు టోర్నమెంట్ ను ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్ధులు తరచుగా ఇలాంటి పోటీలలో పాల్గొనడం ద్వారా క్రీడా నైపుణ్యం పెరగడమే కాకుండా మానసికంగా కూడా ఎంతో దృడంగా తయారవుతారని చెప్పారు. ఈ పోటీలను నిర్వాహకులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు విజయానంద్, దినేష్ ఆనంద్, రామానంద్, బీంరావు, త్రిభువన్ తదితరులు పాల్గొన్నారు.