గద్దర్‌పై కాల్పుల విషయంలో తనను తప్పుగా అర్థం చేసుకున్నారని మాజీ సీఎం, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లినపుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాటి కాల్పుల తర్వాత గద్దర్ అనేక సార్లు తనకు ఫోన్ చేశారని చంద్రబాబు చెప్పారు. 1997లో చంద్రబాబు హయాంలోని కాల్పులపై ఆయన స్పందించారు. గద్దర్ అంటే భయం లేని వ్యక్తి అని అభివర్ణించారు. ఆయన వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. గద్దర్ లక్ష్యం, తన లక్ష్యం ఒకటేనన్నారు. ఇద్దరం పేదల హక్కుల పరిరక్షణ కోసం పరితపించే వాళ్లమన్నారు. గద్దర్ లేని లోటు పూడ్చలేనిదన్నారు. ప్రజా యుద్ధ నౌక పేరు వింటేనే గద్దర్ గుర్తొస్తారన్నారు. గద్దర్ ఎన్నో ప్రజా పోరాటాలకు శ్రీకారం చుట్టారన్నారు. దగ్గర్ జీవితం భావి తరాలకు ఆదర్శమని చంద్రబాబు అన్నారు.