
పార్టీ అధ్యక్షులు, సీఎం కెసిఆర్ ఇవ్వాళ విడుదల చేసిన BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ లో తనకు అవకాశం కల్పించిన సీఎం కెసిఆర్ గారికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారికి రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి, పాలకుర్తి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనను మరోసారి ఆశీర్వదించండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వరసగా 8వ సారి బరిలోకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిగుతుండగా, ఓటమి ఎరుగని నేతగా ఉన్నారు. ఎమ్మెల్యేగా 7వ సారి..! కాగా, గతంలో ఒకసారి వరంగల్ ఎంపీ గా మంత్రి గెలిచారు. ఇంకోసారి సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బరిలోకి దిగుతున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశా…! రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపా…!! ఇంకో అవకాశం ఇస్తే, మీ సేవకుడి లా పని చేస్తా… ప్రజల రుణం తీర్చుకుంటా అన్నారు. పాలకుర్తి ప్రజలు మంచివారిని, తమకు మంచి చేసే వారిని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుని గుండెల్లో నిలుపుకుంటారని అన్నారు. తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన సీఎం కెసిఆర్ కి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి కృతజ్ఞతలు…! ధన్యవాదాలు!! తెలిపారు. ఇదిలా ఉండగా పాలకుర్తి నియోజకవర్గంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. హైదరాబాద్ లో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు పలువురు మంత్రి ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.