
టిక్కెట్టు ఖరారు కాలేదని బాధ పడకండి, సవాళ్లు వచ్చినప్పుడే ధీటుగా నిలబడాలి..
ఎన్నికల కోసం అభ్యర్ధులు వెను వెంటనే పుట్టరు, ప్రజాసేవ ద్వారా వారు ఈ అర్హతలు సంపాదించుకోవాలి..
పౌరసత్వంపై అక్టోబర్ లో మనకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి! ఆ సమస్య తీరితే మనకు ఆటంకాలు ఉండవు..
నియోజకవర్గ పలు సర్వేలకాధారంగా ఉత్తమంగా పనిచేసామన్న సి ఎం వ్యాఖ్యలే మన దశాబ్ద కాలం నిస్వార్థ ప్రజా సేవకు నిదర్శనం..
వేములవాడ నాకు ఎమ్మెల్యే పదవిచ్చె ఒక నియోజకవర్గం కాదు, ఈ ప్రాంత ప్రజల తో పెనవేసుకున్న సుధీర్ఘ రాజకీయ పేగుబంధం! ఇది ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది…
వచ్చే రెండు మాసాల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి కలిసికట్టుగా కృషి చేద్దాం..
కలిసికట్టుగా భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకుందాం..
వెంటనే వందలాది మన కార్యకర్తలు, ఆభిమానులు, కార్యకర్తలు తమ ఆందోళనను ఈ నిర్నయం మన ప్రాంతానికి సరైనది కాదు
పార్టీ అధ్యక్షులు కె సి ఆర్ చెప్పిన విధంగా కోర్టు లో పౌరసత్వం పైన కేసు ఉన్నది అయితే కేసు వాదనలు పూర్తయ్యి తీర్పు కోసం వేచి ఉన్నాము.. ఈ తీర్పు సెప్టెంబర్ చివరి లేక అక్టోబర్ మొదటి వారంలో వస్తుంది.ఈ తీర్పు గతంలో లాగా మనకు అనుకూలంగా వస్తుంది
నా అభ్యర్థిత్వానికి ఒకే అడ్డంకి అయిన కోర్టు తీర్పు కై వేచి ఉండాల్సిందే!
పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయం కూడా ఇదే.
ఈ విషయం పైన అతి త్వరలో మీ అందరితో చర్చిస్తాను.
ఎవరు అధైర్య పడవద్దు! మనందరి భవిష్యత్తు కార్యక్రమం పైన కలసికట్టుగా నిర్ణయం తీసుకుందాం.