
బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్‌లో చేరారు. పీసీసీ చీఫ్ రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఖానాపూర్ నుంచి రేఖా నాయక్‌కు టికెట్ ఇవ్వలేదు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ తరపున గెలిచిన రేఖ ఈసారి కూడా టికెట్ తనదేననే ధీమాతో ఉన్నారు. కానీ తనకు మొండి చెయ్యి ఎదురు కావడంతో ఆమె కంట తడి పెట్టారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ దక్కదని ఆమె టెన్షన్ పడ్డారు. కానీ ఈ సారి ధీమాగానే ఉన్నా అంతా బెడిసి కొట్టింది. దాంతో ఈ సారి బరిలోకి దిగాలనుకున్న శ్యామ్ నాయక్ వెంటనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రేఖా నాయక్ మాత్రం మీడియాతో మాట్లాడుతూ తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని చెప్పారు. కాగా ఖానాపూర్ బీఆర్ఎస్ టికెట్ కేటీఆర్ స్నేహితుడైన భూక్యా జాన్సన్ నాయక్‌కు దక్కింది.