
సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్లపై వీరోచిత పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్నారనీ, బీఆర్ఎస్ టికెట్లలో మహిళ వాటా సంగతి ఏమిటని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రశ్నించారు. బీఆర్ఎస్ జాబితాలో కేవలం ఏడుగురు మహిళలకే చోటు దక్కిందనీ, అంటే ఇది కేవలం ఆరు శాతం మాత్రమేనన్నారు. మరి కవిత మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఢిల్లీలో పోరాటం చేయడం ఎందుకని ప్రశ్నించారు. కవిత తీరు చూస్తే ఆమెదంతా ఒక నాటకమని అర్థమవుతోందన్నారు. జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు దక్కే ప్రాధాన్యత ఇదేనా అని ప్రశ్నించారు. బీజేపీ మాత్రం తన సంస్థాగత పదవుల్లో 30 శాతం మహిళలకు కేటాయిస్తున్న విషయాన్ని రాణి ఈ సందర్భంగా గుర్తు చేశారు.