
సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా పోటీకి నిలవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రాములమ్మ ఆయనతో తలపడేందుకు సై అంటున్నారు. బీజేపీ నేత, సినీ నటి రాములమ్మ సీఎం కేసీఆర్ మీద పోటీ చేసేందుకు చాలా కాలంగా ఉవ్విళ్లూరుతున్నారు. ఆయనపై ఎక్కడైనా పోటీ చేసేందుకు సిద్ధమని చాలా కాలంగా చెబుతున్నారు. గజ్వేల్‌లో పోటీ చేసినా రాష్ట్రంలో ఇంకెక్కడ పోటీ చేసినా తాను కేసీఆర్‌ను ఢీకొట్టి ఓడిస్తానని పలుమార్లు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. తాజాగా ఆమె కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి బీజేపీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కామారెడ్డిలో కేసీఆర్‌ను ఈజీగా ఢీకొట్ట వచ్చని విజయశాంతి అభిమానులు భావిస్తున్నారు.