
భర్త బాటలో బీఅర్ఎస్ ఎమ్మెల్యే
ఎంఎల్ఏ రేఖా నాయక్ కాంగ్రెస్ టికెట్ కి అప్లై చేశారు. నిన్న సీఎం కేసిఆర్ విడుదల చేసిన జాబితాలో ఖానాపూర్ సిట్టింగ్ రేఖా నాయక్ పేరు లేదు. దాంతో ఆమె కన్నీరు పెట్టుకొని బిఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్పారు. ఆమె ఆ మాటలు అనే సమయానికి ఆమె భర్త శ్యామ్ నాయక్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇపుడు తాజాగా రేఖా నాయక్ ఏకంగా కాంగ్రెస్ టికెట్ కోసమే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో స్థానిక రాజకీయం ఆసక్తి కరంగా మారింది. రేఖా నాయక్ కాంగ్రెస్ చేరిక ఖాయమని తేలింది.