
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో మహత్మాగాంధీ జ్యోతిబాయ్ పూలె బాలికల రెనిడెన్సియల్ స్కూల్ లో బాలిక ఆత్మహత్య చేసుకుంది.స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న జిల్లోజు శివాని(14) క్లాస్ రూంలో ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.ప్రిన్సిపాల్ అనిత తెలిపిన వివరాలను బట్టి.. తొమ్మిదో తరగతిలో ఏడుగురు బాలికల ప్రవర్తన సరిగా లేదని గుర్తించి,వారి పేరెంట్స్ ను నిన్న పిలిపించి వారికి పిల్లల ప్రవర్తన తీరును వివరించారు.పది రోజుల పాటు ఇంటికి తీసుకెళ్లమని ప్రిన్సిపాల్ పేరెంట్స్ కు సూచించారు.అందుబాటులో లేమని శివాని పేరెంట్స్ ప్రిన్సిపాల్ కు చెప్పారు.ఇదిలా ఉండగానే ఇవ్వాల తెల్లవారుజామున హాస్టల్ నుంచి క్రిందకు వచ్చి శివాని క్లాస్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించినట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. పిఎస్ లో కంప్లైంట్ చేసినట్లు ఆమె వెల్లడించారు.విచారణ చేస్తున్నట్లు ఎస్సై హరికృష్ణ వెల్లడించారు.పేరెంట్స్ మందలిస్తారనే భయంతోనే శివాని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.