
తిరుమలలో మాట్లాడిన
ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కామెంట్స్..
నా మనవడికి పుట్టున్వెంట్రుకలు తిరుమల శ్రీవారి చెంత తీసాము..
రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణం..
నా కుమారుడు సమాజ సేవ చేస్తున్నాడు, అతనికి సపోర్ట్ ఉంటాను
నిన్న నేను వ్యక్తిగతంగా మాట్లాడాను..
హైదరాబాద్ వెళ్లాకా పూర్తి సమాచారం ఇస్తాను..
నా మెదక్, మల్కాజ్గిరి ప్రజలతో మాట్లాడి తర్వాత కార్యాచరణ చెప్తాను..
నాకు ప్రజల మద్దతు ఉంది.. నాతో పాటు నా కుమారుడికి టికెట్లు ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తాము..
నా కృషితో ఎదిగాను, అలాగే ఉంటాను..
కేసీయార్ కు నేను విజ్ఞప్తి చేస్తున్నా.. నా కొడుక్కి మెదక్ సీట్ ఇవ్వండి. అక్కడ నా కొడుకు కచ్చితంగా గెలుస్తాడు. కేసీఆర్ ను నేను ఏమీ అనలేదు. ఆయన నన్ను ఏమీ అనలేదు. నేను మల్కాజ్ గిరి, నా కొడుకు మెదక్ నుంచి గెలుస్తాం. కరోనా లాంటిది వచ్చి ఎప్పుడు పోతామో తెలీదు. బతికున్నప్పుడు జీవితానికి విలువ లేకపోతే ఎలా?