
తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా సభకు ముందు బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి, బీజేపీ ప్రాధమిక సభ్యత్వానికి కోనేరు సత్యనారాయణ అలియాస్ చిన్ని రాజీనామా చేశారు. ఆయన నేడు సీఎం కేసీఆర్ను, ఎమ్మెల్సీ కవితలను కలిశారు. ఈయన తండ్రి దివంగత కోనేరు నాగేశ్వరరావు సుధీర్ఘ కాలం శాసన సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరవున సేవలు అందించారు. నియోజకవర్గ ఎం.ఎల్.ఏ అభ్యర్థి వనమా వెంకటేశ్వర రావు గెలుపు కొరకు కృషి చేయాలని కోనేరు సత్యనారాయణ అలియాస్ చిన్నికి సీఎం కెసిఆర్, ఎమ్మెల్సీ కవితలు విజ్ఞప్తి చేశారు.