
మావోయిస్టు నాయకులు మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రారెడ్డి క్షేమంగా ఉన్నారనీ, వాళ్లు చనిపోయినట్లు వచ్చిన వార్త కరెక్ట్ కాదని మావోయిస్టు అధికార ప్రతినిధి మంగ్లీ పేరిట ఒక నోట్ విడుదల అయ్యింది. దండకారణ్యంలో పోరాటంలో ఉన్న నాయకుల మూవ్మెంట్స్ తెలుసుకునేందుకే నిఘా వర్గాలు ఈ పని చేస్తున్నాయని ఆరోపించారు. పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న మానసిక యుద్ధమే ఇదన్నారు. దీన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజలు ఈ విషయాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.