
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ బిఅరెస్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే డా రాజయ్య కు టికెట్ దక్కకపోవడంతో స్థానిక క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే రాజయ్య బిఅరెస్ ప్రజాప్రతినిధులు,నాయకుల సమక్షంలో కంటతడి పెట్టారు. ఆయనపై ఒకరొక్కరు నాయకులు పడి బావురుమని ఏడ్చారు. సీఎం కేసీఆర్ తనకు భరోసా ఇచ్చారని ఉన్నతమైన పదవి ఇస్తామని చెప్పారని అన్నారు. సీఎం కేసీఆర్ గీసిన గీత మేరకు పనిచేస్తామని,అభివృద్ధి పనులు చేసేందుకు కార్యకర్తలు సహకరించాలని కోరారు.