
కూనo నేని సాంబశివ రావు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి.
*విలీనం దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి.
*తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్ట్ ల పాత్ర మరువలేనిది.
*తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం,భూ పంపిణీ చేసింది కమ్యూనిస్ట్ లు…కమ్యూనిస్ట్ ల చరిత్ర లేకుండా చేయాలని అప్పటి ప్రభుత్వాలు చూశాయి..
ఇప్పుడు ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి..
*సెప్టెంబర్ 11 నుండి సెప్టెంబర్ 17 వరకు రైతాంగ సాయుధ పోరాటలను గుర్తుకు చేసేలా కార్యక్రమాలు ఉంటాయి..17 వ తేదీ ఎగ్జి బిషన్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఉంటుంది..
*బీజేపీ స్వతంత్ర పోరాటం లో లేదు..రైతాంగ సాయుధ పోరాటం ను ముస్లిం లకు హిందూ లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం అని బీజేపీ వాళ్ళు అంటున్నారు.
*కానీ అప్పటి నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళ లో మగ్దుo మోహినుద్దిన్,షేక్ బందగి, షోయా భుల్ల ఖాన్ లు ఉన్నారు.
*చరిత్రను వక్రీకరించకుండా ఇప్పటి ప్రభుత్వాలు చూడాలి..
- తెలంగాణ సాయుధ పోరాటం ను స్ఫూర్తి గా తీసుకుని తెలంగాణ మలి దశ ఉద్యమం జరిగింది.
*దేశ భవిష్యత్ ను దృష్టి లో పెట్టుకుని ఇండియా కూటమి లో చేరాము…
brs వాళ్ళు మాతో పొత్తు వద్దు అనుకున్నప్పుడు మాకు సీట్లు ఇస్తామని ఎందుకు వచ్చారు..
*ఇప్పుడు మమ్ములను అంటున్న brs నేతలు..మీరు గతంలో కాంగ్రెస్, టీడీపి తో ఎందుకు పొత్తులు పెట్టుకున్నారు.
*గతంలో మాతో పొత్తులు పెట్టుకుని మిత్ర ధర్మం మరిచి మేము పోటీ చేసిన దగ్గర కూడా brs నుండి అభ్యర్థులను పోటీ చేయించారు..
నిమిష నిమిషానికి మారేది వాళ్ళే… రాజకీయ విలువలు లేకుండా చేస్తున్నారు.. కుళ్ళు,కుట్రలు వెన్నుపోటులు,శవాల మీద ఆసనం వేసుకుని రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళు..
*మాకు 30 సీట్ల లో 10,000 వేల ఓట్లకు పైగా ఉన్నాయి… సిపిఎం కు కూడా చాలా స్థానాల్లో ఓట్లు ఉన్నాయి.
*జనాలు ఇవన్నీ చూస్తున్నారు..జనాలు మీకు సరైన రీతిలో బుద్ధి చెపుతారు…
*మాకు జరిగిన అన్యాయం ను ప్రజల్లోకి తీసుకు వెళతాము.
*గతంలో మేము చేసినట్టు ఇప్పుడు మళ్లీ మిలిటెంట్ పోరాటాలు చేస్తాము..