
యాదాద్రి భువనగిరి జిల్లా :-
- ఇటీవల బి ఆర్ ఎస్ పార్టీ బిసిలకు తక్కువ ఎం ఎల్ ఏ టికెట్స్ ఇచ్చిన నేపథ్యంలో ఆ జాబితాను సవరించాలని డిమాండ్ చేస్తూ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భువనగిరి పట్టణం లోని జ్యోతి బా పూలే విగ్రహం వద్ద నిరసన.. బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ :-
- బి ఆర్ ఎస్ పార్టీ టికెట్స్ కేటాయింపు పై ఫైర్.
- 5 శాతం ఉన్న రెడ్ల కి 40 టికెట్లు ఇచ్చి సామాజిక న్యాయాన్ని బొంద పెట్టారు..
- టిఆర్ఎస్ పార్టీ అంటే రెడ్ల రావుల సమితిగా మారింది.
- 60 శాతం ఉన్న బీసీలకు కేవలం 23 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారా ?
- కేసీఆర్ రాజులు చక్రవర్తులు ఎలా అయితే ప్రవర్తిస్తారో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు.
- రాష్ట్రంలో అర శాతం కూడా లేని వెలమలకు 12 టికెట్లు ఇచ్చారు
- బీసీలలో ఉన్న 136 కులాల్లో కేవలం ఆరు కులాల మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు కేటాయించారు 130 కులాలకు ప్రాతినిధ్యం లేదు.
- రాష్ట్రంలో 40 లక్షల పైగా ఉన్న ముదిరాజులకు ఒక టికెట్ కూడా కేటాయించలేదు.
- మహిళలకు కేవలం 7 టికెట్లు కేటాయించారని దానిలో 6 టికెట్స్ అగ్రకుల మహిళలకి కేటాయించడం పట్ల ఆగ్రహం.
- అందులో బీసీ మహిళ ఒక్కరు కూడా లేరు.
- దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం.
- 2023 ఎన్నికలే బి ఆర్ ఎస్ కి చివరి ఎన్నికలు కాబోతున్నాయి..