
ప్రేమ పేరిట మోసపోయానని నిమ్స్ వైద్యురాలు పంజా గుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్…
నిమ్స్ వైద్యురాలు ప్రేమ పేరిట మరో డాక్టర్ తో సహజీవనం చేసి ఆ తర్వాత మోసపోయానని కంప్లైంట్ చేసిన ఘటన పంజా గుట్ట లో చోటు చేసుకుంది..
కేరళకు చెందిన ఓ వైద్యురాలు (34) నిమ్స్ లోని
క్లినికల్ విభాగంలో సీనియర్ రెసిడెంట్గా చేరారు.
ఆ సమయంలో గ్యాస్ట్రో సర్జరీ విభాగం డా.సౌరవ్
చౌదరితో ఆమెకు పరిచయం ఏర్పడింది. 2020లో
ఇద్దరు నిమ్స్ హాస్టల్లో ఉండడంతో వీరి మధ్య స్నేహం
ప్రేమగా మారింది.పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో
సౌరవ్ సహజీవనం చేసి, కోల్కతా వెళ్లిపోయాడు.
మోసపోయానని గ్రహించిన ఆమె తాజాగా పంజాగుట్ట
పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసునమోదైంది.