
అమెరికా (USA) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రికార్డు సృష్టించారు. ఎన్నికల్లో జోక్యం ఆరోపణల్లో ఆయన నేడు జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయారు. ఆ దేశ చరిత్రలో మగ్షాట్ తీయించుకొన్న తొలి మాజీ అధ్యక్షుడిగా నిలిచారు. ఆయనకు ఖైదీ నంబర్ P01135809 కేటాయించారు. ఈ సందర్భంగా పోలీసు రికార్డుల కోసం ఆయన ఫొటో (మగ్షాట్) కూడా తీశారు. ఆయనపై డజనుకు పైగా ఆరోపణలున్నాయి. పోలీసు రికార్డుల ప్రకారం ట్రంప్ (Donald Trump) ఎత్తు 6.3 అడుగులు. 97 కిలోల బరువు ఉన్నారు. ఆయనకు నీలి కళ్లు, స్ట్రాబెర్రీ హెయిర్ ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు.