
ప్రభుత్వ వైద్యుల సమస్యలు పరిష్కరించకుంటే త్వరలో వైద్య గర్జన : తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర ప్రతినిధుల బృందం
దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వైద్య మరియు ఆరోగ్యశాఖ పరిధిలోని వైద్యుల సమస్యలు పరిష్కరించాలి :
తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం వైద్యులకు అండగా ఉంటుంది
ప్రభుత్వ ఆరోగ్య పథకాలు వైద్యులు మరియు వైద్య సిబ్బంది అమలు చేస్తున్నందు వల్లనే దేశంలో మొదటి స్థానం దిశగా తెలంగాణ ఆరోగ్యరంగం పరిగెడుతుంది
శుక్రవారం నాడు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల ప్రతినిధులు మరియు క్రియాశీల సభ్యులు కోటి లోని అలుమ్ని గెస్ట్ హౌస్ ఉస్మానియా వైద్య కళాశాల ఆవరణలో 600 మంది సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధుల బృంద సభ్యులు మాట్లాడుతూ వైద్య మరియు ఆరోగ్య శాఖ పరిధిలో వైద్య విధాన పరిషత్ లో పనిచేసే వైద్యులను, సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసి వారికి ట్రెజరీ ద్వారా జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. వైద్య విధాన పరిషత్ లో పనిచేసే ఉద్యోగులకు హెల్త్ కార్డులు లేకపోవడం దారుణం అని అన్నారు. మెడికల్ కళాశాలలో పనిచేసే వైద్యులకు 2016 పి.ఆర్సి ఏరియల్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, గత ఆరు నెలలుగా పిఆర్సి ఏరియల్ చెల్లించకుండా ఫైల్ పెండింగ్లో పెట్టడం సబబు కాదని అన్నారు. రూరల్ మెడికల్ కళాశాలల్లో పనిచేస్తున్న బోధన వైద్యులకు రూరల్ అలవెన్సులు వెంటనే విడుదల చేయాలి. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘాన్ని చర్చలకు పిలిచి ప్రభుత్వ వైద్యుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని అని డిమాండ్ చేశారు. డాక్టర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని అన్నారు. డి.హెచ్ పరిధిలో టైం బౌండ్ ప్రమోషన్లను వెంటనే కల్పించాలని సీనియారిటీ ప్రాతిపదికన జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారులను 33 జిల్లాలకు తీసుకోవాలని, ఎడిషనల్ డి.ఎం.హెచ్.ఓ పోస్టులను డి.ఎం.హెచ్.ఓ లుగా మార్చుతూ విడుదల చేసిన జీవోని వెంటనే వెనక్కు తీసుకోవాలని, వారి స్థానంలో సీనియారిటీ ప్రాతిపదికన నింపాలని డిమాండ్ చేశారు. ఎస్. పి. ఎం పూర్తి చేసిన వారికి ఆ పోస్టులు లేటరల్ ఎంట్రీ ద్వారా ఇవ్వడానికి వీలు లేదని వారిని జిల్లాలలో ఉన్న డీ.ఎస్.ఓ (ఐ.డి.యస్.పి) లుగా నియమించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లలో ముఖ్యమైనవి…
డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
1. 2016 పిఆర్సి వేతన బకాయిలు 2023 వరకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు
2. రూరల్ మెడికల్ కళాశాలల్లో బోధన వైద్యులకు రూరల్ అలవెన్స్
3. మెడికల్ కళాశాలలో తగిన వసతులు
వైద్య విధాన పరిషత్:
1. వైద్యులు మరియు వైద్య సిబ్బందికి 010 ద్వారా ట్రెజరీ జీతాలు ఇవ్వాలి.
2. హెల్త్ కార్డులు జారీ చేయాలి
3. ఆసుపత్రి స్థాయికి తగ్గ సిబ్బంది నియామకం చేయాలి.
4. పూర్తిస్థాయి వసతులు కల్పించాలి.
5. నూతన డి సి హెచ్ ఎస్ పోస్టులు 33 జిల్లాలకు ఇవ్వాలి
డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ;
1. నిర్ణీత కాల వ్యవధి ప్రమోషన్లు డిహెచ్ పరిధిలోని వైద్యులకు కల్పించాలి. ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి డిసిగ్నేటెడ్ డిప్యూటీ సివిల్ సర్జన్, 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి డిసిగ్నేటెడ్ సివిల్ సర్జన్లుగా హోదా కల్పించాలి
2. అన్ని జిల్లాలకు సీనియారిటీ ప్రాతిపదికన రెగ్యులర్ డిఎంహెచ్వోల నియామకం చేయాలి
3. క్రొత్త గా నియామకం చేసిన ఐదు డి.ఎం.హెచ్.ఓ పోస్టులను జోనల్ పరిధిలో కాకుండా జిల్లా కలెక్టర్ పరిధిలో ఉంచాలి. వాటిని సీనియార్టీ ప్రకారం భర్తీ చేయాలి.
4. వైద్యులకు వాహన సౌకర్యం కల్పించాలి
5. ప్రోటోకాల్ హోదా కల్పించాలి
6. వివిధ రకాల అలవెన్సులు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న అలవెన్సులు త్వరగా చెల్లించాలి.
7. డిప్యూటీ డిఎంహెచ్వో లకు ఎమర్జెన్సీ అలవెన్స్ కల్పించాలి..
8. ఆరోగ్య మహిళ చేస్తున్న మహిళా వైద్యులకు ప్రత్యేక గౌరవ పారితోషకం కల్పించాలి..
ESI
1. నిర్ణీత కాల వ్యవధి ప్రమోషన్లు..
2. ప్రత్యేక అలవెన్సులు
పల్లె దవాఖాన , బస్తీ దవాఖానా మరియు కాంట్రాక్ట్ వైద్యులు:
1. కాంట్రాక్టు వైద్యులుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలి.
2. పల్లె దవాఖానాలలో ఉన్న వైద్యుల కనీస జీతాన్ని 60,000 గా పెంచాలని వారు కోరారు.
3.పల్లె దవాఖానాలలో వసతులు మెరుగుపరచాలి.
తమ డిమాండ్ల పరిష్కారం కొరకు ప్రభుత్వం చొరవ చూపించాలని లేనిచో వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని సంఘాలు కలిసి త్వరలో వైద్య గర్జన నిర్వహిస్తామని హెచ్చరించారు. వైద్య గర్జన తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు
ఈ ప్రతినిధుల బృందంలో డాక్టర్ పల్లం ప్రవీణ్, డాక్టర్ బొంగు రమేష్, డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, డాక్టర్ నరహరి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , డాక్టర్ అజ్మీరా రంగ, డాక్టర్ ఉమా కాంత్ , డాక్టర్ రాజు, డాక్టర్ వినోద్ , డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శేఖర్, డాక్టర్ భూపేందర్ , డాక్టర్ రవి , డాక్టర్ రమేష్, డాక్టర్ అబ్బయ్య , డాక్టర్ వసంత్ , డాక్టర్ లక్ష్మణ్ , డాక్టర్ మురళి, డాక్టర్ శ్రీకాంత్ , డాక్టర్ అన్నపూర్ణ , డాక్టర్ రుక్మా రెడ్డి , డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ , డాక్టర్ ప్రతిభా లక్ష్మి , డాక్టర్ రవికుమార్ , డాక్టర్ జయశ్రీ , డాక్టర్ రాజశ్రీ , డాక్టర్ లింగం గౌడ్ , డాక్టర్ చింతమడక సాయిరాం , డాక్టర్ అంబి శ్రీనివాస్, డాక్టర్ అన్వేష్ డాక్టర్ అరవింద్ , డాక్టర్ ముసిబా సల్మాన్, డాక్టర్ అయేషా , డాక్టర్ సుల్తానా, డాక్టర్ విజయలక్ష్మి , డాక్టర్ కరుణాకర్ , తదితరులు ఉన్నారు.