
బైక్ ర్యాలీలతో రేపటితో ముగియనున్న 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రవాసీ ప్రోగ్రామ్
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఈ నెల 20 న వచ్చిన ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు.
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితిని తెలుసుకుని…వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు అవకాశాలు, అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, బూత్ స్థాయి కమిటీల పనితీరు పై హై కమాండ్ కు నివేదిక ఇచ్చేందుకు
యూపీ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, పుడెచ్చేరి నుంచి ఈ ఎమ్మెల్యేలు ఇక్కడ వారం పాటు మకాం వేశారు.
రేపు మధ్యాహ్నం తర్వాత నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీతో ఈ ప్రోగ్రామ్ ముగియనుంది.
రేపు ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. లంచ్ తర్వాత కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలు నిర్వహిస్తారు. ఆ తర్వాత నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు వెనుదిరిగి వెళ్లనున్నారు.
రెండు, మూడు రోజుల్లో హై కమాండ్ కు వీరు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా బీజేపీ వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణ లోని అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేయనున్నారు.