
హైదరాబాద్,
27.08.2023.
శ్రీయుత కె. చంద్రశేఖరరావు గారు,
గౌరవ ముఖ్యమంత్రి,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,
హైదరాబాద్.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, నమస్కారములు.
విషయం:1) గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించుట
తెలంగాణ సాయుధ పోరాటయోధుల చరిత్రను భావితరాలకు అందించుటకు పాఠ్యాంశాంలో పెట్టుట గురించి.
2) మగ్దూం మొహియొద్దీన్ విగ్రహం ఇప్పటికే ఉన్నందున, మిగతా ఇద్దరు రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి విగ్రహాలు ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలి.
3) తొలి అమరుడు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, బొమ్మగాని ధర్మభిక్షం వంటి యోధుల విగ్రహాలను ఆయా కూడలీలలో గౌరవంగా పెట్టుట గురించి.
సెప్టెంబర్ 17న తెలంగాణను భారతదేశంలో విలీనమైన దినంగా భారత కమ్యూనిస్టు పరిగణిస్తున్నది. భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాటి నైజాం రాక్షస పాలనకు వ్యతిరేకంగా తప్పనిసరి పరిస్థితిలలో రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపివ్వడం జరిగింది. 1948 సెప్టెంబర్ 11న ఆంధ్రమహాసభ తరుపున కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి, ఎఐటియుసి తరుపున కామ్రేడ్ మఖ్దూం మొహియొద్దీన్ , కమ్యూనిస్టు పార్టీ తరుపున కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి ముగ్గురు కలిసి సాయుధ పోరాటానికి సంయుక్త పిలుపిచ్చిన నేతలుగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిరది. ఆ పోరాటంలో నాలుగున్నర వేల మంది అమరులైన విషయం మీకు తెలుసు. తెలంగాణ రైతాంగ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములను పేదలకు కమ్యూనిస్టు పార్టీ పంపిణీ చేసింది. మూడు వేల గ్రామాలను నైజాం రాచరిక పాలన నుండి విముక్తి కల్పించింది. వెట్టిచాకిరి రద్దుకు తొలిపునాధి వేసింది. బానిసత్వానికి వ్యతిరేకంగా, కాళ్లు మొక్తా బాంచన్ దొర అనే దుస్థితి నుండి బందూకు పట్టుకొని తిరగబడే స్థితికి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టుపార్టీ ప్రజలను చైతన్యవంతులను చేసింది. వెట్టిచాకిరిలో మునిగిన మట్టి మనుషులని పోరాటయోధులుగా తీర్చిదిద్దడంలో నాటి పోరాటం మహోజ్వల పాత్ర పోషించింది.
ఆనాటి పోరాట సంస్కృతి ఇప్పటికి తెలంగాణ ప్రజల గుండెల్లో విడదీయరాని బంధంగా ఉన్నది. కులమతాలకు అతీతంగా వెట్టిచాకిరి, బానిస సంస్కృతికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేసినటువంటి త్యాగాలు తెలంగాణ ప్రతి గ్రామగ్రామాన గోచరిస్తాయి. ఆనాటి కమ్యూనిస్టుల పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నాటి సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్రలేని ఆర్ఎస్ఎస్, బిజెపిలు మతోన్మాదాన్ని అంటగట్టి సాయుధ పోరాటానికి వక్ర భాష్యాలు చెబుతున్నాయి. అసత్యాలతో, వక్రీకరణలతో బిజెపి, ఆర్ఎస్ఎస్లు ఈ పోరాటాన్ని హైజాక్ చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నది. కమ్యూనిస్టు పార్టీలు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరపాలని పోరాటం చేశారు. కమ్యూనిస్టులుగా, పోరాట వారసులుగా విలీన దినాన్ని జరపాలని పోరాటం చేస్తున్నది. భారత స్వాతంత్రోద్యమంలో భాగంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం గర్తించి ఇచ్చే పెన్షన్లు కూడా బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మంజూరీని నిలిపివేసిన ప్రబుద్దులు నిసిగ్గుగా ప్రకటనలు చేస్తున్నారు. నైజాం వ్యతిరేక పోరు మాట ఎత్తె నైతిక హక్కు వారికి లేదు. కమ్యూనిస్టు పార్టీ, నాటి కాంగ్రెస్ జాతీయవాదులు ఆనాటి ఫ్యూడల్ వ్యవస్థపై తిరుగుబాటు చేశారు.
ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ ఈ ప్రతిపాదనలను మీముందుంచుతున్నది.
1) తెలంగాణ రైతాంగా సాయుధ పోరాట ఫలితంగా భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనమై 75 సంవత్సరాలలోకి అడుగిడిన నేపథ్యంలో గత ఏడాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినోత్సవంగా పాటిస్తూ 16, 17,18 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అయితే విలీన దినోత్సవంగా నిర్వహిస్తే బాగుండేది. గత ఏడాది సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించిన విధంగా ఈ ఏడాది కూడా నిర్వహించడంతో పాటు, ప్రతి ఏటా ఉత్సవాలను నిర్వహించాలి
2) నాటి నైజాం వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన ముగ్గురిలో మగ్దూంó మొహియొద్దీన్ విగ్రహం ఇప్పటికే ఉన్నందున, మిగతా ఇద్దరు రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి విగ్రహాలు ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలి. తొలి అమరుడు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, బొమ్మగాని ధర్మభిక్షం వంటి యోధుల విగ్రహాలను ఆయా కూడలీలలో గౌరవంగా పెట్టాలి.
2) జవహర్ లాల్ నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు సాధించిన, ప్రజాస్వామ్యానికి ప్రతిబింభమైన పార్లమెంట్ భవనంలో మొదటి అడుగు మోపిన రావి నారాయణ రెడ్డి విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టడానికి మీరు చొరవ తీసుకోవాలి.
3) సాయుధ పోరాటంలో దాదాపు నాలుగు వేల మంది అమరులైయ్యారు. అందుకు చరిత్ర సాక్షం. వారిని గుర్తించి వారిపేర్లతో ఢల్లీిలోని ఇండియా గేట్ మాదిరిగా హైదరాబాద్లో స్మారక స్థూపాన్ని, మ్యూజియంను ఏర్పాటు చేయాలి. బ్రతికివున్న వారి కుటుంబాలకు గౌరవ పెన్షన్ ఇవ్వాలి. సాయుధ పోరాటంలో పాల్గొన్న బ్రతికున్న యోధులను ఈ సందర్భంగా సన్మానించాలి.
4) ఆనాటి రైతాంగ సాయుధ పోరాటాన్ని, రావి నారాయణ రెడ్డి, మఖ్దూం మోహినూద్దీన్, బద్దం ఎల్లారెడ్డిల త్యాగాలను చరిత్రలో నిలిచిపోయేందుకు విద్యార్థులకు పాఠ్యాంశాలలో చేర్చాలి.
5). నాటి మహోజ్వల చరిత్రను భావి తరాలకు అందించేందుకు ఒక కమిటీ వేసి చరిత్రను లోతుగా పరిశోధన చేసి సాధికార గ్రంథాలను వెలువరించేందుకు చర్యలు తీసుకోవాలి.
అభివందనములతో,
(కూనంనేనిసాంబశివరావు)
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.