
రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు చెందిన కొందరు యువకులు భారీ వర్షాల్లో రీల్స్ చేద్దామనుకున్నారు. వరదతో ఉప్పొంగుతున్న ఒక కల్వర్టు వద్దకు వెళ్లి మంచి పోజులతో రీల్స్ మొదలు పెట్టారు. ఆ సంబరంలో పై నుంచి వస్తున్న వరదను గమనించలేకపోయారు. రీల్స్ మైకంలో నుంచి బయటపడి చూసుకునే సరికి చుట్టూ నీళ్లు. వాళ్లను రక్షించడానికి అధికారులు క్రేన్ తీసుకొచ్చి సహాయం చేయాల్సి వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు వరద ప్రాంతాలకు రీల్స్ కోసం వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.