
మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాలు
చేస్తూ ఎమ్మేల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ ని సుప్రీంకోర్టు
ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. మహిళను విచారణ కోసం ఈడి
కార్యాలయానికి పిలవవచ్చా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తామని
సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. పిటిషన్ విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్
కౌర్ ధర్మాసనం కవిత పిటిషన్ పై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు
చేయాలని ఈడికి ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో
రిజాయిండర్ ను దాఖలు చేయాలని కవితకు సూచించింది. కవిత
తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గి
వాదనలు వినిపించారు. తెలంగాణా అదనపు అడ్వకేట్ జనరల్ జే
రామచందర్ రావు విచారణకు హాజరయ్యారు.