
సోమవారం నూతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం
రెండు గంటల నుంచి ప్రారంభమయ్యే ఆ సమావేశంలో 40 నుంచి 50
అంశాల మీద మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో కురిసిన భారీ
వర్షాలతో సంభవించిన వరదలు, ప్రభుత్వం తీసుకోనున్న చర్యలపై
కూడా ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. రాష్ట్రంలో అకాలవర్షాల
వల్ల వ్యవసాయరంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ
తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కూడా కేబినెట్
చర్చించనుంది. అలాగే వరదల కారణంగా రవాణా మార్గాలకు నష్టం
వాటిల్లడంతో యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధరించడంపై
చేపట్టాల్సిన చర్యలపైనా రాష్ట్ర మంత్రివర్గం ఇందులో
ద్రుష్టిసారించనుంది.