
ఎమ్మేల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ తనకు న్యాయం
చేయాలంటే జాతీయమహిళా కమిషన్ కి మరోసారి ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరిగే వరకు తనను వదిలేది లేదంటూ ఆమె మరోసారి స్పష్టం చేశారు.
కమిషన్ సూచన మేరకు అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి
మూడురోజులు గడిచినా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇంతవరకూ ఎఫ్ ఐ
ఆర్ నమోదుచేయలేదని, తనను గదిలో బంధించి తప్పుడు కేసు పెట్టి
వేధించే ప్రయత్నం చేశారన ఆరోపించారు. ఎమ్మేల్యే పోలీసులతో
తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పార్లమెంట్ ముందు కూడా ఆమె నిరసన తెలిపే ప్రయత్నం చేశారు.