
ఓఆర్ఆర్ టెండర్ల వివరాలు అడిగితే ఓ ఎంపీకి ఇవ్వకపోవడం ఏంటని హైకోర్టు తెలంగాణ సర్కారును ప్రశ్నించింది. ఆర్టీఐ ఉన్నది ఎందుకనీ, ప్రతిపక్షాలకు డీటెల్స్ ఇవ్వకపోతే అసెంబ్లీలో వారు ఏం మాట్లాడతారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. రెండు వారాల్లో ఆయనకు అన్నివివరాలు సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. స్పందించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టు ఆదేశాలు పాటిస్తామని తెలిపారు.
ఓఆర్ఆర్ టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వివరాలు కావాలని టీపీసీసీ అధ్యక్షుడు అధ్యక్షుడు రేవంత్ రెడ్డిడ్డి ఆర్టీఐని కోరారు. అక్కడి నుంచి సమాధానం రాకపోవడంతో ఆయన కోర్టుని ఆశ్రయించారు. పిటిషన్ స్వీకరించిన కోర్టు జులై 28న ఈ వ్యాఖ్యలు చేసింది.