
భారీ వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలతోపాటు వరంగల్ కూడా నీట మునిగింది. అయితే హైదరాబాద్‌కు చాలా కామన్ అయిన వరదలు వరంగల్‌కు కొత్తే అని చెప్పవచ్చు. ఎంత గట్టి వాన పడ్డా నివాస ప్రాంతాలు నీట మునగలేదు. కానీ ఈ మధ్య వరంగల్ టౌన్కీ ఆ తిప్పలు తప్పడం లేదు. 35 నుంచి 40 కాలనీలు ఇపుడు నీళ్లలోనే ఉన్నాయట. రెస్క్యూ కోసం అధికారులు మర పడవలు తెప్పించారు. అవి నదుల్లో వెళ్లినట్టే వరంగల్ రోడ్లపై రయ్యిన రాకపోకలు సాగిస్తున్నాయి.