దేశ వ్యాప్తంగా గులాబీరంగు కండ్లకలక కేసులు పెరిగాయి. ఈ
నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సకాలంలో చికిత్స
తీసుకోవాలని ప్రజలకు వైద్యలు సూచిస్తున్నారు. వర్షకాలంలో
రకరకాల వైరస్ లతో పాటు బాక్టీరియా ఇన్ఫెక్షన్లు పెరిగే ప్రమాదం
పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఒకరినుంచి
ఒకరికి వేగంగా వ్యాపిస్తాయని హెచ్చరిస్తున్నారు.
ప్రతిసంవత్సరం లాగే ఈ ఏడాది కూడా గులాబిరంగు కన్ను అని పిలిచే
కండ్లకలక కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్, ఒడిషాలలోని ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఝాన సంస్థల
కేంద్రాలన్నింటిలో జూలై ఒకటి నాటికి వెయ్యి కండకల్లక కేసులు
నమోదయ్యాయి. వారందరికీ చికిత్స అందింది. కండ్లకలక అన్ని
వయసుల వారినీ ఇది ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు,
వ్రుద్ధులు, బలహీనమైన రోగనిరోధకశక్తి ఉన్నవారికి ఈ సమస్య
మరింత హాని కలిగిస్తుందని వైద్యులు చెపుతున్నారు. ఇది
అంటువ్యాధి కాబట్టి, కండ్లకలక సోకకుండా తరచూ చేతులు
కడుక్కుంటుండాలని, పర్సనల్ వస్తువులను ఇతరులతో
పంచుకోకూడదని, కళ్లను తాకకూడదని వైద్యులు చెపుతున్నారు.
కళ్లు ఎర్రగా ఉండి, దురద ఉండడం, కంటి నుంచి అధిక స్రావం
కారడం, జ్వరం, గొంతునొప్పి వంటివి దీని లక్షణాలు. ఈ లక్షణాలు
కనిపించగానే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.