
అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఒక కార్పోరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రజా గాయకుడు గద్దర్‌ను ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుక్రవారం (జులై 28) పరామర్శించారు. గద్దర్ త్వరగా కోలుకోవాలని పవన్ ఈ సందర్భంగా ఆకాక్షించారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని రాజకీయ పరిస్థితులపై ఇద్దరు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.
రాజకీయం పద్మవ్యూహం వంటిదని, అతి జాగ్రత్తగా ముందుకెళ్లాలని గద్దర్, పవన్‌కు సూచించారు. భారత దేశం ప్రస్తుతం 60 శాతం యువతతో నిండివుందని, ఇలాంటి సమయంలో యువ నాయకత్వం ఎంతో అవసరమని పవన్ ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. విజయం నీదేనంటూ ఒక అన్నగా ఆశీర్వదించినట్లు జనసేన ఒక ప్రకటనలో తెలిపింది.