Skip to content
- రేపు సాయంత్రం వరకు షెడ్యూల్ ని రిలీజ్ చేస్తారు.
- సెప్టెంబర్ ఒకటవ తేదీ కటాఫ్ డేటుగా లాంగ్ స్టాండింగ్ కు ఉపాధ్యాయులకు 8 సంవత్సరాలు, ప్రధానోపాధ్యాయులకు 5 సంవత్సరాల నిబంధన కొనసాగుతుంది/వర్తింపజేస్తారు.
- 5/8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయుల/ ప్రధానోపాధ్యాయుల స్థానాలను ఖాళీలుగా జాబితాలో చేరుస్తారు.
- రిటైర్మెంట్ కు 3 సంవత్సరాల లోపు సర్వీసున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు ఇస్తారు
- అన్ని రకాల పదోన్నతులకు సంబంధించి సీనియార్టీ జాబితాలను సిద్ధం చేసుకోవాలని రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా అధికారులకు సూచనలు ఇచ్చారు.
- కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వబడుతుంది.
- గతంలో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని, అదనంగా స్పాజ్ బదిలీలకు పాయింట్లు దరఖాస్తు చేసుకోవచ్చు, తొలగించుకోవచ్చును.
- రెండు రోజుల్లో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పూర్తిస్థాయి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.