
ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటి కప్పుడు ఎండగట్టాల్సిన అవసరం ఉందని, నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజల వైపు ఉంటామనే భరోసాను పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు బరోసా ఇవ్వాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 4న ఇందిరాపార్కు దగ్గర ధర్నా నిర్వహించాలన్న ఆలోచనలో బాగంగా గురువారం పార్టీ శ్రేణులతో ..టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ..పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ,కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు,నియోజకవర్గ ఇన్ఛార్జులు, కో-ఆర్డినేటర్లు, త్రిమెన్ కమిటీ సభ్యులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు,పార్లమెంట్ పార్టీ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు. ధర్నా కార్యక్రమంపై శుక్రవారం పార్టీ శ్రేణులకు స్పష్టత ఇస్తామని అన్నారు.పార్టీ నిర్ణయం ప్రకారం ధర్నా కార్యక్రమం లో అందరూ పాల్గొనాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాఖీ పండగ పురస్కరించుకొని టీడీపీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా రాష్ట్రంలోని యావత్ మహిళా సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఆగస్టు 28,29 తేదిలలో..అయా జిల్లాల కలెక్టర్లు ,ఆర్డీవో ,ఎమ్మార్వో లకు వినతి పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ఆదేశానుసారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్వహించారు.ఈ క్రమంలో పార్లమెంట్ , అసెంబ్లీ, మండల స్థాయిలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ..ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలుపుతూ..ఈ కార్యక్రమ నిర్వహణ పై కాసాని జ్ఞానేశ్వర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించి సమీక్ష జరిపారు. టీడీపి పార్టీ శ్రేణులు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ దళితులు,గిరిజనులు, వెనుకబడిన వర్గాలు ,రైతులు,మహిళలు, యువత, పేదలకు ఇచ్చిన హామీల వైఫల్యాలపై సోమ,మంగళ వారాలలో కలెక్టర్,ఆర్డీవో, ఎమ్మార్వో లకు వినతి పత్రాలను సమర్పించే కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విజయవంతం చేశారని కాసాని ధన్యవాదాలను తెలిపారు.