
మహిళా సంఘాల ప్రతినిధులకు ఉత్తర్వుల కాపీని అందజేసిన మంత్రులు
రక్షా బంధన్ కానుకగా, రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకు(వీ వో ఏ) ల వేతనాలను పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సిఎం నిర్ణయం మేరకు వీరి వేతనాలు నెలకు రూ. 8000 కు పెరగనున్నాయి. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 17,608 మంది ఐకేపీ మహిళా సంఘాల సహాయకు ( వీ వో ఏ) లకు లబ్ధి చేకూరనున్నది. సిఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన వేతనాలు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి వస్తాయి. వేతన పెంపు ద్వారా ఏడాదికి రూ. 106 కోట్లు ప్రభుత్వ ఖజానా పై అదనపు భారం పడనున్నది. అయినా ఖర్చుకు వెనకాడకుండా మహిళా సంక్షేమమే ధ్యేయంగా సిఎం కేసీఆర్ మానవీయ కోణంలో వేతన పెంపు నిర్ణయం తీసుకున్నారు.
ఇతర విజ్జప్తులనూ అంగీకరించిన సీఎం
తమ జీతాలు పెంచాలని, తమకు యూనిఫాం కోసం నిధులను అందించాలని, తమకు ప్రతి మూడునెల్లకోసారి అమలవుతున్న రెనివల్ విధానాన్ని సవిరిస్తూ దాన్ని ఏడాదికి పెంచాలని, విజ్జప్తులను తక్షణమే పరిష్కరిస్తూ సిఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాగా తమకు జీవిత బీమా కూడా అమలు చేయాలనే మహిళా సంఘాల సహాయకుల విజ్జప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.
తాము యూనిఫాం డ్రెస్ విధానాన్ని అనుసరిస్తామని, అందుకోసం నిధులు విడుదల చేయాలని మహిళా సంఘాల సహాయకుల అభ్యర్థన మేరకు ఏడాదికి రూ. 2 కోట్లు నిధులను అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మహిళా సంఘాల సహాయకుల విధులకు సంబంధించి, ప్రతి మూడు నెల్లకు వో సారి చేసే రెనివల్ విధానాన్ని ఇకనుంచి ఏడాదికి చేసేలా సవరించాలని సీఎం నిర్ణయించారు. వీఏవోలు తమకు జీవిత బీమా అందించాలని సీఎంకి చేసుకున్న విజ్జప్తికి సానుకూలంగా స్పందించి, ఇందుకు సంబంధించిన విధి విధానాలను అధ్యయనం చేసి నివేదిక అందించాలని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సీఎం ఆదేశించారు.