
అమిత్ షా మాస్టర్ స్కెచ్
మంత్రి కేటీఆర్‌పై బీజేపీ జనరల్ సెక్రెటరీ, ఎంపీ బండి సంజయ్‌ను రంగంలోకి దింపాలని ఆ పార్టీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. హోం మంత్రి, బీజేపీ మాస్టర్ మైండ్ అమిత్ షా ఈ మేరకు ఆలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కుటుంబంపై బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీ చేస్తానని బీజేపీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి బరిలోకి దిగనున్నట్లు ప్రకటించుకున్నారు. దాంతో కామారెడ్డిలో ఎంపీ ధర్మపురి అరవింద్‌ను రంగంలోకి దించాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.