
స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గంలోని జానకీపురం సర్పంచ్ నవ్య తాను ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని ప్రకటించారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఆమె సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. దశాబ్ధాలుగా కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలే పోటీ చేస్తున్నారనీ, కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నారు. దళిత బిడ్డనైన తనకు అవకాశం కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చాలా కాలంగా ఒక్కరిద్దరికే అవకాశం దక్కుతుండడంతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారనీ, తమ బాధలను చెప్పుకోలేక పోతున్నారని అన్నారు. అందుకే తమకు అవకాశం కల్పించడం ద్వారా ఒక ఆడ బిడ్డకు తగిన ప్రాధాన్యతను ఇచ్చినట్లవుతుందని నవ్య అన్నారు. తనకు అవకాశం ఇస్తే తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.