
ప్రజల చైతన్యాన్ని, ప్రశ్నించే గొంతును బలోపేతం చేసే లక్ష్యంతో TPJAC. ( తెలంగాణ పీపుల్స్ జేఏసీ ) ఏర్పాటు..
కన్వీనర్ గా ప్రొఫెసర్ హరగోపాల్.. మరో 50 మందితో కమిటీ ఏర్పాటు
ప్రొఫెసర్ హరగోపాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..
రాష్ట్రంలో పరిస్థితి దయనీయంగా ఉంది
ధర్నా చౌక్ తీసేసారు…ఒకే వ్యక్తి పాలన చేస్తున్నారు
మీటింగ్ కు అనుమతి ఇవ్వడం లేదు
యూనివర్సిటీలు నిర్వర్యం అయ్యాయి
బడులు కూలి పోతున్నాయి
కేజీ టు పీజీ విద్య ఏమైందో ఎవరికి తెలియదు
ఉద్యమంలో ఏర్పడ్డ జెఏసిలు కొనసాగి ఉంటే బాగుండేది
పౌర సమాజం సైలెంట్ గా ఉంది
తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి
మాకు వివిధ సంఘాలు మద్దతు పలికాయి
మాకు మద్దతు తెలిపి కలిసి వచ్చే సంఘాలతో ముందుకు వెళతాం
అందరూ కలిసి పోరాడితే రాష్ట్రాన్ని కాపాడు కోవచ్చు
ప్రజల దగ్గరకు వెళతాం…వారిని చైతన్యవంతం చేస్తాము
అన్ని వర్గాల ప్రజలు సమస్యలు తెలుసుకుంటము
రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా అవగాహన కల్పిస్తాము
ఎన్నికల కోసం ఏర్పాటు చేసింది కాదు…ఎన్నికల తరువాత కూడా కొనసాగుతుంది.
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసాము
రాష్ట్రంలో జర్నలిస్టుల మీద , పత్రికల మీద దౌర్జన్యం, కొనసాగుతుంది…
ప్రజాస్వామ్య, సామాజిక తెలంగాణ కోసం పోరాడుదాము