
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ రేపు చాలాచోట్ల మరియు ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి భారీ వర్షాలు రాష్టంలో అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.
ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన తెలకపాటు నుండి మోస్తారు వర్షం రాష్ట్రంలో ఆదిలాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిజామాబాద్ జగిత్యాల్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశంవుంది. ఉరుములు మెరుపులకు సంబంధించి ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు
ఆవర్తనము ఒకటి ఈశాన్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టంకి 4.5 కిమీ ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉంది. ఈ ఆవర్తనము నుండి ద్రోణి ఒకటి దక్షిణ ఆంధ్ర తీరం వరకు సముద్ర మట్టంకి 3.1 కిమీ ఎత్తులో ఏర్పడింది. నిన్నటి కోస్తా ఆంధ్రప్రదేశ్ కు దగ్గర పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ ఆవర్తనము ఈరోజు బలహీనపడింది. మరొక ఆవర్తనము ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో సెప్టెంబర్ 3వ తేదీన ఏర్పడే అవకాశం ఉన్నది.