
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయాలన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్సార్ చివరి కోరికను నెరవేర్చడమే మనం వైయస్సార్ కు అర్పించే నిజమైన నివాళి
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చూపించిన మార్గంలో.. ఆయన వేసిన బాటలో కాంగ్రెస్ నాయకులు పనిచేయాలి
ఈనాటి సమాజానికి కావలసిన అవసరాలను ఆనాడే గుర్తించిన డాక్టర్ వైయస్సార్
పేదలకు స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు మెరుగైన వైద్యం కల్పించడానికి ఆరోగ్యశ్రీ, ఉన్నత చదువులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీడు భూములను సస్యశ్యామలం చేయడానికి నదీ జలాలు తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన జిల్లా యజ్ఞం- ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇలా అనేక కార్యక్రమాలు ముందు చూపుతో చేసిన మహనీయుడు డాక్టర్ వైయస్సార్
తెలుగు రాష్ట్రాల్లో చదివిన పేద విద్యార్థులు ప్రపంచంలో సాఫ్ట్వేర్ రంగాల్లో రాణించడానికి ఆనాడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్
చదువుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు రావాలని హైదరాబాదును ఉపాధి మార్గంగా అభివృద్ధి చేసిన వైయస్సార్
హైటెక్ సిటీని మరింత అభివృద్ధి చేసి సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకొచ్చారు.
హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వేయడంతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చేసి యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేందుకు పరిశ్రమలు రావడానికి పునాదులు వేసిన దార్శనికుడు డాక్టర్ వైయస్సార్
రాష్ట్రంలో విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలని త్రిబుల్ ఐటీ ని తీసుకువచ్చిన వైయస్సార్
వైయస్సార్ ఆలోచనపరంగా కలుద్దాం.. నడుద్దాం… కలిసి ప్రయాణం చేద్దాం. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలన్న వైయస్సార్ చివరి కోరికను నెరవేర్చడానికి మనందరం కష్టపడుదాం.
వైయస్సార్ మరణం బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వైయస్సార్