
ఎస్సీ వర్గీకరణ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తో సహా అన్ని పార్టీలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు త్వరలో నిర్వహించనున్న చివరి పార్లమెంటు సమావేశాల్లో అనుకూలంగా వ్యవహరించాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
ప్రధానంగా వర్గీకరణ అంశానికి 29 సంవత్సరాల నుంచి అనుకూలంగా ఉన్నామని చెబుతున్న బిజెపికి ఇదే చివరి అవకాశమని పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు, బీజేపీ పార్టీ బిల్లు ప్రవేశ పెట్టక పోతే మరోవైపు గతం నుంచి అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా తమ చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ లు పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర పార్టీలు అయిన బిఆర్ఎస్ , వైఎస్ఆర్సిపి , టిడిపి కూడా తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ఇది ఆఖరి అవకాశమని తెలిపారు. బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టే కార్యాచరణలో భాగంగా 3 తారీకు నుంచి 22 తారీకు వరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు.