
కామారెడ్డి జిల్లాకు మెరుగైన కరెంటు కోసం కామారెడ్డి జిల్లాలో రైతుల ఆందోళన
వ్యవసాయానికి కరెంటు సరిపడ రాక పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుందని పేర్కొంటూ కామారెడ్డి జిల్లాలో రైతులు ఆందోళన చేశారు
బిక్కనూరు మండలం భాగ్యర్తి పల్లి సబ్‌స్టేషన్‌ను రైతులు ముట్టడించారు. వ్యవసాయానికి కరెంటు ఆరు నుంచి ఏడు గంటలు కూడా రావడం లేదని దీంతో పంటలు ఎండిపోతున్నాయని 24 గంటల పాటు కరెంటు సప్లై చేయాలని రైతులకు డిమాండ్ చేశారు. కామారెడ్డి మండలం నరసన్న పల్లి సబ్‌స్టేషన్ ఎదుట కూడా రైతులు ఆందోళన నిర్వహించారు. వ్యవసాయంకి ప్రస్తావిస్తున్న కరెంట్ సరిపోవడంలేదని సప్లై పెంచాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళన చేశారు.