
బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం!
ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడనున్న ఆవర్తన ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది..
దీనివల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఒక ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. విదర్భ నుంచి అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్లు ఐఎండీ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శనివారం పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి.