
సివిల్స్ లో మొత్తం 24 సర్వీసులు ఉన్నాయి.
వీటిలో మూడు ఆల్ ఇండియా సర్వీసెస్.
- Indian Administrative Service (IAS)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలను అమలు చేసే బాధ్యత వీరిదే. అత్యంత ప్రతిష్టాత్మకమైన, బాధ్యతగల ఉద్యోగం. రాష్ట్రంలో ఛీఫ్ సెక్రటరీ, కేంద్రంలో కేబినెట్ సెక్రటరీ వరకు ఎదిగే అవకాశం ఉంటుంది.
- Indian Police Service (IPS)
జిల్లా ఎస్పీ స్థాయినుండి CBI, IB, CRPF, BSF, CISF, RAF వంటి వాటికి డైరక్టర్, డైరక్టర్ జనరల్ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది.
- Indian Forest Service (IFS)
రాష్ట్రంలోను, కేంద్రంలోను ఛీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ స్థాయి దాకా వెళ్ళే అవకాశం ఉన్నది.
గ్రూప్ A సివిల్ సర్వీసెస్ ….
- Indian Foreign Service (IFS)
వివిధ దేశాలలో హై కమీషనర్, ఛార్జ్ డీ అఫైర్స్, రాయబారులు, ఐక్యరాజ్యసమితి, కేంద్రంలో విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి స్థాయికి చేరుకోగలరు.
- Indian Audit and Accounts Service (IAAS)
వివిధ ప్రభుత్వ శాఖల, సంస్థలను ఆడిట్ చేసేందుకు నియోగించబడతారు. వీళ్ళు కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్ (CAG) క్రింద పని చేస్తారు.
- Indian Civil Accounts Service (ICAS)
వీళ్ళు కూడా పైన చెప్పిన పనులే చేస్తారు. కానీ రాష్ట్ర స్థాయిలో ఎకౌంటెంట్ జనరల్ క్రింద పని చేస్తారు.
- Indian Corporate Law Service (ICLS)
కేంద్ర కార్పొరేట్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన లీగల్ విషయాలు చూస్తారు.
- Indian Defence Accounts Service (IDAS)
రక్షణరంగంయొక్క ఎకౌంట్స్ తనిఖీ చేస్తారు,
- Indian Defence Estates Service (IDES)
కంటోన్మెంట్స్, ఎయిర్ ఫోర్స్, నేవీలకు చెందిన భూములు, భవనాల నిర్వహణ.
- Indian Information Service (IIS)
కేంద్ర సమాచార శాఖకు చెందినది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆలిండియా రేడియో, దూర్ దర్శన్ లలో పని చేస్తారు.
- Indian Ordinance Factories Services (IOFS)
ఆయుధ తయారీ పరిశ్రమలలో పని చేస్తారు. రక్షణశాఖకు చెందినది.
- Indian Communication Finance Service (ICFS)
టెలీకామ్ రంగానికి చెందిన ఆర్థిక వ్యవహారాలు చూస్తారు.
- Indian Postal Service (IPoS)
పోస్ట్ & టెలిగ్రాఫ్ శాఖకు చెందినది. పోస్ట్ మాస్టర్ జనరల్ స్థాయికి చేరగలరు.
- Indian Railway Accounts Service (IRAS)
రైల్వేల ఆదాయ, వ్యయాలను పర్యవేక్షించేది.
- Indian Railway Personnel Service (IRPS)
రైల్వే ఉద్యోగుల నియామకంనుండి పదవీ విరమణ వరకు వీరి ఆధ్వర్యంలోనే నడుస్తుంది.
- Indian Railway Traffic Service (IRTS)
దేశంలో రైళ్ళ నిర్వహణ బాధ్యత.
- Indian Revenue Service (IRS)
లిస్టులో వెనుక ఉందని తక్కువ అంచనా వేయకండి. ఇన్కమ్ టాక్స్, కస్టమ్స్ & ఎక్సైజ్ శాఖలో ఆఫీసర్ స్థాయినుండి ఛీఫ్ కమీషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, Central Bureau of Direct Taxes (CBDT), Central Board of Indirect Taxes (CBIT), GST Council వరకు వెళ్ళే అవకాశం ఉన్నది. ఈ మధ్య మనం తరచుగా వింటున్న ‘ఈడి’ (Enforcement Directorate) ఈ కేడర్ నుండే వస్తారు.
- Indian Trade Service (ITS)
వాణిజ్యశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. DGFT (Director General of Foreign Trade) స్థాయివరకు వెళ్ళేందుకు అవకాశం ఉంది.
- Railway Protection Service (RPF)
రైల్వే ఆస్తుల రక్షణ బాధ్యత. రైల్వేల ఆధీనంలో పని చేస్తుంది.
గ్రూప్ B సర్వీసెస్ ….
- Armed Forces HQ Civil Service
త్రివిధ దళాల, పారా మిలిటరీ కేంద్ర కార్యాలయాలలో Non Combating సర్వీస్.
- DANICS (Delhi, Andaman & Nicobar Islands, Lakshadweep, Daman & Diu and Dadra & Nagar Haveli Civil Services)
ఆయా కేంద్ర పాలిత ప్రాంతాలలో IAS వంటిది.
- DANIPS (Delhi, Andaman & Nicobar Islands, Lakshadweep, Daman & Diu and Dadra & Nagar Haveli Police Service)
ఆయా కేంద్రపాలిత ప్రాంతాలలో IPS వంటిది.
- Pondicherry Civil Services
పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో IAS వంటిది.
- Pondicherry Police Service
పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో IPS వంటిది.
మొత్తం 24 సర్వీసులు ఉన్నాయి.
ఇవికాక Indian Economic Service, Indian Military Engineering Service, Indian Statistical Service, Military Medical Service, Armed Forces Nursing Service …