సునీల్ కనుగోలు చేసిన సర్వే నివేదికలు కూడా స్క్రీనింగ్ కమిటీ నేతల ముందు పెట్టినట్లు సమాచారం.
నిన్న ఎన్నికల కమిటీ నేతలతో వన్ టు వన్ మాట్లాడిన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్.
ఇవ్వాళ డీసీసీ ప్రెసిడెంట్లు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రులతో విడివిడిగా మురళీధరన్ మాట్లాడారు.
అందరి నుండి అభిప్రాయ సేకరణ చేసినట్లు టాక్.
తమకు అవకాశం ఇవ్వాలని కోరిన నేతలు.
ఐతే జాబితాలో వున్న మిగతా నేతల పరిస్థితి, బలాబలాపై వివరణ కోరిన మురళీధరన్.
అందరి నేతల అభిప్రాయాలను నోట్ చేసుకున్న మురళీధరన్.
సాయంత్రం 7 గంటల వరకు సాగిన వన్ టు వన్ భేటీ..
తరవాత స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, సభ్యులు సిద్ధిఖీ, జిగ్నేష్ మేవాని, ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ సెక్రెటరీలు, ఎన్నికల కమిటీ నేతలతో కలిసి సునీల్ కనుగోలు భేటీ అయ్యారు.
గంటకు పైగా చర్చించినట్లు సమాచారమ్.
ఆశావహులు జాబితా, సర్వే నివేదికలు, cwc మీటింగ్ పై డిస్కస్ చేసిన లీడర్లు.