
వినాయక చవితి ఈ నెల 18న జరుపుకోవాలా?
19న జరుపుకోవాలా?..
..అన్న భక్తుల సందేహాలపై కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దేవస్థానం పండితులు స్పష్టత ఇచ్చారు.
‘ఈ నెల 18నే వినాయక చవితి జరుపుకోవాలి. కాణిపాకంలో అదే రోజున నిర్వహిస్తున్నాం. చంద్రమానం ప్రకారం చవితి తిథి 18వ తేదీనే ఉంది. ఆరోజు నుంచి 21 రోజుల పాటు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం’ అని వారు తెలిపారు.
కాగా కొందరు మాత్రం ఈ నెల 19న చవితి నిర్వహించాలని అనుకుంటున్నారు.