
ఉస్మాసాగర్ 6 క్రస్ట్ గేట్లు, హిమాయత్ సాగర్ 6 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన జల మండలి అధికారులు. లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. మూసి పరివాహక ప్రాంత వాసులను అప్రమత్తం చేసిన అధికారులు. ఉధృతంగా ప్రవహిస్తున్న ఈసీ, మూసీ వాగులు. రాజేంద్రనగర్ నుండి పోలీస్ అకాడమీ వైపు వెళ్లే ఔటర్ సర్వీసు రోడ్డును పూర్తిగా మూసి వేసిన పోలీసులు. రాకపోకలకు అంతరాయం. నార్సింగీ నుండి మంచి రేవుల గ్రామానికి వెళ్లే దారిని మూసి వేసిన నార్సింగీ పోలీసులు. గండిపేట జలాశయం నుండి భారీగా దిగువకు ప్రవహిస్తున్న వరద ఉదృత. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచన. ఎగువ ప్రాంతాల నుండి జంట జలాశయాలకు భారీగా చేరుతున్న వరద ప్రవాహం. వికారాబాద్, తాండూర్, శంకర్ పల్లి, షాబాద్, షాద్నగర్, పరిగి తో పాటు పలు గ్రామాల నుండి భారీ వరద ప్రవాహం.