
నిన్న వాయువ్య బంగాళాఖాతం పరిసరాళ్ల లోని దక్షిణ ఒడిస్సా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాల్లో ఉన్న అల్పపీడన ప్రాంతం ఈ రోజు బలహీన పడింది. నిన్నటి ఆవర్తనం ఈ రోజు దక్షిణ ఇంటీరియర్ ఒడిస్సా, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టంకి 7.6 కిమి వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకి వాలి ఉంది
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడతాయి. రేపు పలు ప్రాంతాల్లో, ఎల్లుండి కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. అల్ప పీడనం బలహీన పడడంతో రాష్టంలో ఈ రోజు ఒక్కరోజే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్రంలో భారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో (ఉత్తర, తూర్పు) కురిసే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్స్ జారీ చేసింది.
ఈరోజు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో ( గాలి వేగం గంటకు 30 నుండి 40 కిమి తో) కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.