
‘శ్రీకృష్ణ జన్మాష్టమి’ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
“ఉట్ల పండుగ”గా పిలుచుకుంటూ యువతి యువకులు కేరింతలతో శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని సీఎం కేసీఆర్ తెలిపారు.
శ్రీకృష్ణుడి జీవితాన్ని అవలోకనం చేసుకుంటే స్థితప్రజ్ఞులుగా ఎదగవచ్చని సీఎం తెలిపారు.
భగవద్గీత ద్వారా కర్తవ్యబోధన, లక్ష్య సాధన కోసం ఫలితం ఆశించని స్థితప్రజ్ఞతతో కూడిన కార్యనిర్వహణ వంటి పలు ఆదర్శాలను మానవాళికి అందించిన శ్రీకృష్ణుని కృపాకటాక్షాలు ప్రజలందరికీ అందాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.