
తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెడుతున్నారు. తన పార్టీ పేరును రిజిస్టర్ చేస్తూ ఈసీకి దరఖాస్తు కూడా చేసుకున్నారు. తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో ఆయన భారత ఎన్నికల సంఘానికి (ఈసీ) దరఖాస్తు పెట్టారు. ఈసీ కూడా పార్టీ పేరు మీద కానీ, ఇతర విషయాలపై అభ్యంతరాలుంటే చెప్పాలని తన వెబ్సైట్లో ప్రకటించింది. అందుకు గడువు కూడా విధించింది. సెప్టెంబర్ 30వ తేదీ లోపున అభ్యంతరాలు చెప్పాలని సూచించింది. తాను ఏప్రిల్ నెలలోనే పార్టీ పేరును రిజిస్టర్ చేసుకున్నట్లు మల్లన్న తెలిపారు. తన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా మాదం రజినీ కుమార్, కోశాధికారిగా ఆర్.భావన వ్యవహరిస్తారని పేర్కొన్నారు.