
మణిపూర్‌లోని ఘటనలపై సుప్రీం కోర్టు సీరియస్‌గా ఉంది. సోమవారం జరిగిన కేసు విచారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక ప్రశ్నలు వేసింది. పలు అంశాల్లో వివరాలను కోరింది. ఇప్పటి వరకు మణిపూర్‌లో ఎన్ని జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయో చెప్పాలన్నది. మహిళలపై దాడులు జరిగాక ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంలో ఎందుకు జాప్యం జరిగిందో వివరించాలని ఆడిగింది. నమోదైన కేసుల్లో ఏ కేటగిరి కింద ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయో వివరాలు అందజేయాలని చెప్పింది. ఇప్పటి వరకు జరిగిన ఘటనల్లో ఎందర్ని అరెస్టు చేశారో చెప్పాలన్నది. రాష్ట్రంలోని కోర్టుల్లో కేసుల పురగతి ఏమిటో వివరించాలన్నది. కోర్టు ఇంకా అనేక విషయాలను పరిశీలిస్తున్నదనీ, తామడిగిన వివరాలను మంగళవారం కోర్టుకు అందజేయాలని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ప్రభుత్వ తరపున న్యాయవాదులను ఆదేశించారు. విచారణను ఆ మేరకు వాయిదా వేశారు.