
ఔటర్ రింగ్ రోడ్డుపై 120 కిలోమీటర్ల స్పీడ్‌కు సైబరాబాద్ పోలీసులు ఓకే చెప్పారు. ఆగస్టు 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి రానున్నాయి. లైన్ 1, 2 లలో ఇకపై వంద నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్‌ను అనుమతిస్తారు. లైన్ 3, 4లలో 80 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్‌లో వెళ్లవచ్చు. ఐదో లైన్లో 40 కిలోమీటర్ల స్పీడ్‌కి ఓకే చెప్పారు. 40 కన్నా తక్కువ వేగంతో వెళ్లే వాహనాలను ఔటర్‌పైకి అనుమతించరు. టూ వీలర్లకు కూడా ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు అనుమతి లేదు. పాదచారులు కూడా ఔటర్‌పైకి రాకూడదని, వస్తే జరిమానా తప్పదని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.