
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ ఈటల రాజేందర్ గారు మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యాంశాలు
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టుగా రుజువు చేస్తే రాజీనామా చేస్తా. రాష్ట్రంలో హోంగార్డుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఐదు నెలల జీతాలు పెండింగ్ లో ఉన్నాయి.హోంగార్డులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. జీతాలు సరిగ్గా రాక హోంగార్డులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
రోజుకు 900 రూపాయాలతో జీవితాన్ని హోం గార్డులు కొనసాగించే పరిస్థితి. హోంగార్డులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ ఫీజులుంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నా సర్కారు నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు.విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ సరిగ్గా అందించడం లేదు.
హాస్టల్స్ లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇవ్వడం లేదు. హెల్త్ కార్డు ద్వారా ఏ ఒక్కరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం అందడం లేదు. ఇది తెలంగాణలో పాలన తీరు.కేయూ విద్యార్థులను వీసీ పోలీసులతో దారుణంగా కొట్టించడం బాధాకరం. విద్యార్థులను విచక్షణారహితంగా, తీవ్రంగా పోలీసులతో కొట్టించిన ఘనత వీసీతో పాటు కేసీఆర్ సర్కార్‌దే.
వీసీ పర్మిషన్ లేకుండా పోలీసులు యూనివర్సిటీకి ఎలా వచ్చారు? పీహెచ్డీ అడ్మిషన్ విషయంలో మెరిట్‌పై మాట్లాడటానికి వెళ్లిన విద్యార్థి నేతలపై పోలీసులు దాడి చేయడం ఏంటి? బీఆర్ఎస్కు కేయూ వీసీ రమేష్ తొత్తుగా పని చేస్తున్నారు. ఆయన ఒక ఎమ్మెల్సీ రికమండేషన్ తో వచ్చినట్టున్నారు.
సమస్యల గురించి అధ్యాపకులతో మాట్లాడి వాటిని పరిష్కరించుకునే సంస్కృతి తెలంగాణలో ఉంది. కానీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు విద్యార్థులను కొట్టడం తెలంగాణ చరిత్రలోనే ఇదే మొదటిసారి. రాష్ట్రంలో విద్యార్థుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.విద్యార్థులు తలుచుకుంటే సామ్రాజ్యలే కూలిపోతాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడంలో కీలక పాత్ర పోషించింది విద్యార్థులే.రుణమాఫీ విషయంలో రైతులను ప్రభుత్వం మోసం చేస్తోంది. రూ. 25 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించి ఐదేళ్లు గడిచినా అమలు చేయలేదు. రైతులను రుణ విముక్తులను చేసి కొత్త లోన్ లను ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం భూములమ్మి ఆదాయం సమకూర్చుకునే పనిలో ఉంది.
లిక్కర్ డ్రా పై చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చాలా మందికి లక్కీ డ్రా లో మద్యం షాప్ లు రాలేదు. మద్యం టెండర్ల డబ్బులు వస్తె తప్ప రైతులకు ఇవ్వడానికి డబ్బులు లేవు.అప్పులలో నెంబర్ వన్, భూములు అమ్ముకోవడం లో నెంబర్ వన్, చిన్న ఉద్యోగులను వేధించడంలో నెంబర్ వన్ తెలంగాణనే.